ETV Bharat / state

మల్లన్న సాగర్ పరిహారంపై రైతుల అసంతృప్తి - pallepahad village

మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. నిర్వాసితులందరికీ నగదుతో పాటు ఇంటి ధ్రువపత్రాన్ని అందించారు. ఇల్లు వద్దనుకున్న వారికి ఖాళీ స్థలంతో పాటు రూ.5 లక్షల నగదు అందించారు.

మల్లన్నసాగర్  నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పరిహారం
author img

By

Published : May 7, 2019, 4:27 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలం పల్లెపహాడ్ గ్రామంలో మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పరిహారం అందించారు. పునరావాసం, పునర్ ఉపాధి కల్పన ప్యాకేజీ కింద 570 మంది నిర్వాసితులకు ఒక్కొక్కరికి రూ.7లక్షల 50 వేలు చెక్కుతో పాటు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఇంటి నిర్మాణ ధ్రువ పత్రాన్ని అందజేశారు. ఇంటి నిర్మాణం వద్దనుకుంటే ఖాళీ స్థలం ధ్రువపత్రంతో పాటు రూ.ఐదు లక్షల చెక్కులను ఇచ్చారు. గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు 5 లక్షల పరిహారం, 250 గజాల స్థల ధ్రువపత్రాన్ని పంపిణీ చేశారు.
ఎలాంటి ఉద్యమం చేయకుండా మల్లన్న సాగర్ నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చామని, తమకు అందరికంటే తక్కువ పరిహారం వచ్చిందని రైతులు వాపోయారు.

lands
స్వచ్ఛందంగా భూములు ఇస్తే, తక్కువ పరిహారం ఇచ్చారు : నిర్వాసితులు

ఇవీ చూడండి: నేటి నుంచి తెలంగాణలో భాజపా ఓదార్పుయాత్ర

Intro:tg_srd_16_07_mallanna_sagar_pariharam_av_g2
అశోక్ గజ్వెల్ 9490866696
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలం పల్లెపహాడ్ గ్రామంలో అధికారులు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ఆర్ ప్యాకేజీ పరిహారం అందజేస్తున్నారు

Body:మల్లన్న సాగర్ ముంపు గ్రామం పల్లెపహాడ్ లో పునరావాసం పునర్ ఉపాధి కల్పన ప్యాకేజీ కింద అ అధికారులు లబ్ధిదారులకు పరిహారం పంపిణీ చేస్తున్నారు పల్లెపాడు లోని 570 మంది నిర్వాసితులకు ఒక్కొక్కరికి రూపాయలు 7లక్షల 50 వేలు చెక్కు తో పాటు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో mutrajpally లోని నిర్మిస్తున్న ఇంటి నిర్మాణం ధృవ పత్రాన్ని అందజేశారు ఇంటి నిర్మాణం వద్దనుకుంటే ఖాళీ స్థలం ధ్రువపత్రం తో పాటు రూ.ఐదు లక్షల చెక్కులు అందజేశారు గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు 5 లక్షల పరిహారం తో పాటు 250 గజాల స్థలం ధ్రువపత్రాన్ని పంపిణీ చేశారు పరిహారం పంపిణీ కోసం అధికారులు ప్రత్యేకంగా 8 కౌంటర్లను ఏర్పాటు చేసి ఇ పంపిణీ ప్రక్రియను సజావుగా కొనసాగిస్తున్నారు పంపిణీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

Conclusion:తమ గ్రామం ఎలాంటి ఉద్యమాలు చేయకుండా మల్లన్న సాగర్ నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చామని తమకు అందరికంటే భూ పరిహారం తక్కువగా వచ్చిందని ప్రస్తుతం ఇస్తున్న ప్యాకేజీ లోనైనా మరింత ప్యాకేజీ పెంచి ఇస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు గ్రామం నుండి ఇ వలస వెళ్లిన వారికి కూడా ప్యాకేజీ డబ్బులు ఇవ్వాలని మరికొందరు డిమాండ్ చేశారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.