సిద్దిపేట అంటే గోదావరి జలాలు, పరిశ్రమలు, రైల్వే స్టేషన్, జాతీయ రహదారి, ఉద్యోగ ఉపాధి అనే విధంగా పారిశ్రామిక అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం కోసం సిద్దిపేట అర్బన్ మండలం, మిట్టపల్లిలో ప్రచార సభ నిర్వహించారు. నెల రోజుల తర్వాత పెంచిన పింఛన్లు అందిస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేటకు కాలుష్యం లేని కంపెనీలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. దసరా నాటికి గోదావరి నీటిని రంగనాయక సాగర్‌కు తెప్పిస్తామని పేర్కొన్నారు. తెరాస అభ్యర్థులను భారీ ఆధిక్యంతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఇవీ చూడండి : 'సీఎం కేసీఆర్ ఎన్నికల కోడ్‌ని ఉల్లఘించారు'