ETV Bharat / state

ప్రజా ప్రతినిధులకు పూలిచ్చి ఆర్టీసీ కార్మికుల నిరసన - ప్రజా ప్రతినిధులకు పూలిచ్చి ఆర్టీసీ కార్మికుల నిరసన

సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు రోజుకో రకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలువురు ప్రజా ప్రతినిధులను కలిసిన ఉద్యోగులు.. పూలిచ్చి నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుకున్నారు.

19TH DAY TSRTC STRIKE AT DUBBAKA
author img

By

Published : Oct 24, 2019, 12:00 AM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మె 19వ రోజుకు చేరింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని పలువురు ప్రజాప్రతినిధులకు కార్మికులు పూలు ఇస్తూ.. నిరసన తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన కార్మికులు.. జడ్పీటీసీ రవీందర్​రెడ్డి, ఎంపీపీకి పూలిచ్చారు. ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన ఆర్టీసీ కార్మికులు నేడు తెలంగాణలో 50 రోజులుగా జీతాలు లేక పస్తులుంటున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు మద్దతివ్వాలని వేడుకున్నారు.

ప్రజా ప్రతినిధులకు పూలిచ్చి ఆర్టీసీ కార్మికుల నిరసన

ఇవీచూడండి: వాతావరణశాఖ హెచ్చరిక... నాలుగు రోజులపాటు వర్ష సూచన

Intro:ఆర్టీసీ సమ్మె 19వ రోజు లో భాగంగా ప్రజాప్రతినిధులకు పూలతో నిరసన, వేడుకోలు.Body:సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె 19 రోజులో భాగంగా ఆర్టీసీ కార్మికులు స్థానిక మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి దుబ్బాక మండల జడ్పిటిసి రవీందర్ రెడ్డి మరియు ఎంపీపీ కి పుష్పాలను ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ 19 రోజులుగా సమ్మె చేస్తున్న ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు అని, తెలంగాణ కోసం కొట్లాడిన ఆర్టీసీ కార్మికులు నేడు తెలంగాణ లో గడచిన 50 రోజులుగా జీతాలు లేక 50 వేల కుటుంబాలు ఉన్నాయని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి డిమాండ్లను పరిష్కరించాలని, ప్రజా ప్రతినిధులు స్పందించాలని వేడుకున్నారు.Conclusion:ఆర్టీసీ సమ్మె 19వ రోజులో భాగంగా దుబ్బాక ఆర్టీసీ కార్మికులు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జడ్పిటిసి మరియు ఎంపిపి మరియు ఇతర నాయకులకు పుష్పాలను ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు.

కిట్ నెంబర్:1272, బిక్షపతి, దుబ్బాక.
9347734523.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.