ETV Bharat / state

చిన్నారి ప్రాణం తీసిన మొబైల్ ఛార్జర్ - died news

అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన పదేళ్ల కూతురును మొబైల్​ ఛార్జర్​ బలితీసుకుంటుందని ఆ తండ్రి ఊహించలేకపోయాడు. చరవాణికి ఛార్జింగ్​ పెట్టమని ఇవ్వగా... విద్యుత్​ షాక్​ తగిలి బాలిక మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్​ మండలం అక్కారంలో జరిగింది.

10-years-girl-died-with-current-shock-through-mobile-charger-in-siddipet-district
మొబైల్​ ఛార్జింగ్​ పెట్టింది... ప్రాణాలు విడిచింది...
author img

By

Published : May 23, 2020, 3:53 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారంలో విషాదం చోటుచేసుకుంది. చరవాణికి ఛార్జింగ్ పెడుతుండగా పదేళ్ల బాలికకు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింది. గ్రామానికి చెందిన కుమ్మరి కిష్టయ్య, బాలమణి దంపతులకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. బాలమణి ఉపాధిహామీ పథకంలో కూలీ పనులకు వెళ్లింది. ఇంటి వద్దే ఉన్న కిష్టయ్య తన మొబైల్​కు ఛార్జింగ్​ పెట్టమని కూతురు స్రవంతికి తెలిపాడు.

సెల్​ఫోన్ ఛార్జింగ్ పెట్టేందుకు వెళ్లిన స్రవంతి విద్యుత్​ షాక్​తో గట్టిగా అరిచి పడిపోయింది. వెంటనే స్పందించిన కిష్టయ్య ఛార్జింగ్​ వైర్​ను తొలగించాడు. స్రవంతిని హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స్రవంతి మృతితో కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు పలువురిని కంట తడి పెటించాయి.

ఇదీ చదవండి: బిడ్డ పెళ్లి లొల్లి.. తెగిన తల్లి తాళి!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.