Zaheerabad Sugarcane Farmers Problems : చెరుకు రైతులకు ఉపయుక్తంగా ఉండేందుకు ఉమ్మడి రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో నిజాం షుగర్స్ లిమిటెడ్ పేరుతో జహీరాబాద్‌లో 1972-73లో చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. రోజుకు 2వేల 500 టన్నులు సామర్థ్యం ఉండేలా దీన్ని ఏర్పాటు చేశారు. 2003లో ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యానికి కర్మాగారాన్ని విక్రయించగా అప్పటి కొంచెం కొంచెంగా అప్పుల్లో కూరుకుపోయింది. గత ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రస్తుత ప్రభుత్వమైనా దీనిపై దృష్టి సారించి చెరుకు రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
ప్రజాభవన్‌కు పాదయాత్రగా బయలుదేరిన జహీరాబాద్ చెరుకు రైతులు
నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఐదేళ్ల క్రితం 40వేల ఎకరాల్లో చెరకు పంట సాగయ్యేది. ఈ సారి మాత్రం 10వేల ఎకరాల్లో మాత్రమే వేశారు. ఈ ప్రాంతంలో చెక్కెర కర్మాగారం లేదు. దీంతో సంగారెడ్డి పరిధిలోని గణపతి, కామారెడ్డి జిల్లాలోని గాయత్రి, మాగి కర్మాగారాలకు పంటను తరలిస్తున్నారు. రవాణా ఛార్డీల భారం అధికమవుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ పిరిధి కొత్తూరులోని ట్రైడెంట్ కర్మాగారం కొనసాగితే రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని ఆకాంక్షిస్తున్నారు.
చక్కెర పరిశ్రమను తెరిపించాలని రైతుల మహాధర్నా
Sugarcane Farmers Problems in Telangana : ఏటా నవంబరు నుంచి ఫిబ్రవరి మధ్య చెరుకు నాటువేసి 10 నుంచి 12 నెలల్లో పంటను కర్మాగారానికి తరలించి గానుగాడించాలి. ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తే రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. చక్కెర మిల్లులు ఏటా నవంబరు రెండో వారంలో గానుగను ప్రారంభించి మార్చి చివరన ముగిస్తాయి. కానీ జహీరాబాద్ సమీపంలోని ట్రైడెంట్ కర్మాగారంలో ఇంతవరకు ఆ ప్రక్రియ చేపట్టలేదు. కనీస ఏర్పాట్లూ పరిశ్రమ ఆవరణ లేవు. చేతికి వచ్చిన చెరుకు పంటను రైతులు ఇతర ప్రాతాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. దీంతో రవాణా ఛార్జీలు రెట్టింపు అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిశ్రమలో పర్మినెంట్ కార్మికులు ప్రతి రోజు కర్మాగారానికి వచ్చి పని సమయం వరకు అక్కడే కుర్చోని వెళ్తున్నారు. వారికి రావాల్సిన జీతాలు కూడా యాజమాన్యం ఇప్పటి వరకు చెల్లించలేదు. వారితో పాటు రైతులను కూడా ఆదుకోవాలని కోరుతున్నారు. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని వాపోతున్నారు
ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ పునఃప్రారంభించాలని రైతుల డిమాండ్
చక్కెర పరిశ్రమ యాజమాన్యం తీరును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి స్వయంగా వివరించేందుకు జహీరాబాద్ ప్రాంత చెరుకు రైలుతు, కార్మికులు పాదయాత్ర చెపట్టారు. పరిశ్రమం నుంచి ప్రారంభించిన పాదయాత్ర జహీరాబాద్ పట్టణానికి చేరుకోగా, రైతుసంఘాల ప్రతినిధులు, వివిధ గ్రామాల రైతులు మద్దతు ప్రకటించారు. బకాయిల చెల్లింపుతో పాటు పరిశ్రమ పనిచేసేలా ప్రభుత్వం చొరవ చూపాలని రైతులు, కార్మికులు ఆకాంక్షిస్తున్నారు. పరిశ్రమ అప్పుల్లో కూరుకుపోయిందని, రైతులకు బాకీలు చెల్లించలేని పరిస్థితిలో ఉందని రైతులు చెబుతున్నారు. పరిశ్రమకు మళ్లీ పూర్వ వైభవం రావాలని వారు కాంక్షిస్తున్నారు.