కరోనా చికిత్సల కోసం ఏర్పాటు చేస్తున్నఆక్సిజన్ ప్లాంట్ను త్వరగతిన అందుబాటులోకి తీసుకురావాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అధికారులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆసుపత్రిలో… కోటి రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
గంటకు 500 లీటర్ల సామర్థ్యంతో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ను జహీరాబాద్ ఆసుపత్రికి కేటాయించటం పట్ల ఆయన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రెండు మూడు రోజుల్లో… ప్లాంట్ వినియోగంలోకి వచ్చేలా పనులు వేగవంతం చేయాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. పరిశీలనలో జిల్లా కొవిడ్ ప్రత్యేక అధికారి డాక్టర్ రాజు గౌడ్, ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి డాక్టర్ శేషు రావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'పదవులు అనుభవించి విమర్శలు సరికాదు'