ETV Bharat / state

ప్రేమకై యువకుడి పోరాటం.. గూడు కోసం గద్ద ఆరాటం.. - young man attempt to sucide

అసలే వేసవికాలం... తొమ్మిదికాక ముందే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఆ యువకుడు ఎండను కూడా లెక్క చేయలేదు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపిస్తేనే... కిందికి వస్తానని శపథం చేశాడు. పిల్ల కోసం టవర్​ ఎక్కాడు. కుటుంబసభ్యులు, బంధువులు నచ్చజెప్పారు. ఇంకేముంది పెళ్లికి ఒప్పుకున్నారు అనుకునే లోపే... కథ అడ్డం తిరిగింది. ఇంతకూ ఏమైంది?

ప్రేమకై యువకుడి పోరాటం.. గూడు కోసం గద్ద ఆరాటం..
author img

By

Published : Apr 1, 2019, 7:53 PM IST

ప్రేమకై యువకుడి పోరాటం.. గూడు కోసం గద్ద ఆరాటం..
తానొకటి తలిస్తే... దైవం మరొకటి తలిచినట్లైంది సంగారెడ్డి జిల్లా కంది మండలానికి చెందిన యువకుడికి. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపించకపోతే... ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అంతేనా సెల్​టవర్​ కూడా ఎక్కేసాడు. కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు చివరకు బంధువులంతా ఒప్పుకున్నారు. ఇంకేముంది సంతోషంగా టవర్​ దిగబోయాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది.

గద్ద వెంటపడింది...

టవర్​ దిగుదాం అనుకునే సరికి ఓ గద్ద అతనిపై దాడి చేసింది. ఒకసారి కాదు పలుమార్లు పదేపదే దాడి చేసింది. కిందకు దిగేంత వరకు ఆపలేదు. అసలేం జరగిందంటే.. యువకుడి టవర్​పై నిలబడినప్పుడు పక్కనే గూడు ఉంది. ఆ యువకుడు తన ఆవాసాన్ని ఎక్కడ పడేస్తాడోనని భయపడ్డ గద్ద అతనిపై దాడి చేసింది. టవర్ దిగేంత వరకు ఇదే పరిస్థితి. గద్ద దాడి నుంచి తప్పించుకుంటూ.. బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు మన ప్రేమికుడు.

ఇదీ చూడండి: 'మెదక్​తో మెజార్టీ విషయంలో పోటీ కష్టమే'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.