కరోనా బారినపడి సంగారెడ్డి పట్టణానికి చెందిన ఓ మహిళా కౌన్సిలర్ మృతిచెందారు. మధుమేహం, జ్వరంతో బాధపడుతున్న కౌన్సిలర్‌ను జూన్ 30న హైదరాబాద్‌లోని చెస్ట్ ఆస్పత్రికి తరలించారు.
మూడో తేదీన కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అనంతరం ఆరోగ్యం విషమించింది. ఆదివారం రాత్రి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. అర్ధరాత్రి రెండున్నర గంటలకు మృతి చెందారు. అప్రమత్తమైన అధికారులు.. ఆమె కుటుంబ సభ్యులు 14 మందిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వీరి నమూనాలు సేకరించి.. కొవిడ్ నిర్ధరణ పరీక్షలకు పంపించనున్నారు.
ఇవీచూడండి: ఒక్కరోజులో 24,248 కేసులు.. మూడో స్థానానికి భారత్