ETV Bharat / state

నిత్యం నీటి కష్టాలు... ఉండవా పరిష్కారాలు

వర్షాకాలం వచ్చినా తాగునీటి కష్టాలు కొలిక్కి రాలేదు. బిందె నీటి కోసం పడిగాపుల దృశ్యాలు ఇంకా దర్శనమిస్తూనే ఉన్నాయి. అడుగంటిన భూగర్భ జలాలు.. మైదానాన్ని తలపిస్తున్న నదులకు తోడు అధికారుల నిర్లక్ష్యం నీటి కష్టాలను రెట్టింపు చేశాయి. ​సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ మున్సిపాలిటీలో బిందె నీటి కోసం గడియలకొద్దీ వేచిచూడాల్సిన దుస్థితి. నీళ్లో రామచంద్ర అన్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.

నిత్యం నీటి కష్టాలు... ఉండవా పరిష్కారాలు
author img

By

Published : Jul 26, 2019, 10:52 PM IST

నేటి రోజుల్లో ఎవరి నోట విన్నా జలం మూలం ఇదం జగత్ అనే వినిపిస్తోంది. ఖాళీ బిందెల బారులు.. నాలుగు రోజులకోసారి వచ్చే వంతు.. అప్పుడైనా దొరికేవి నాలుగైదు బిందెలు.. వారానికోసారి స్నానం. ఇదేదో మారుమూల ఊళ్లో కాదు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ వాసుల దుస్థితి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు.. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడం వల్ల కాలనీ వాసుల నీటి కష్టాలు వర్ణణాతీతం.

బిందె నీటి కోసం రోజుల కొద్దీ ఎదురు చూపు

కాలనీలో ఉన్న ఒక్క బోరు నుంచి మాత్రమే నీరు వస్తోంది. దీనికోసం వంతులు వేసుకుని మరీ బిందెలతో రేయింబవళ్లు పడిగాపులు కాస్తున్న పరిస్థితి. నీటి కష్టాలను గురించి అధికారులకు, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారి వేధన అరణ్య రోదణగానే మిగిలింది. పలుకుబడి ఉన్న నేతల కాలనీలకు మాత్రమే నీళ్లిస్తున్నారని తమను ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బోరుమీదే ఆధారపడి 1500 మంది కాలం వెళ్లదీస్తున్నామన్నారు. నాలుగు రోజులకోసారొచ్చే నంబరు కోసం పిల్లల్ని బడి మాన్పించి మరీ నీటికోసం క్యూలైన్లో కూర్చోబెడుతున్న పరిస్థితి ఉందన్నారు. పడుకోకుండా... వండుకోకుండా నీటి కోసమే పడిగాపులు కాస్తున్నామని చెబుతున్నారు.

అధికారులేమంటున్నారు

భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్ల అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా సాధ్యం కావడం లేదని అధికారులు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరలో సమస్య పరిష్కరిస్తామంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు వేడుకుంటున్నారు.

నిత్యం నీటి కష్టాలు... ఉండవా పరిష్కారాలు
ఇదీ చూడండి: మురుగు నీటితో... వ్యవసాయం

Intro:tg_srd_27_26_water_problem_in_zaheerabad_pkg_ts10059
( ).... ఖాళీ బిందెల బారులు.. నాలుగు రోజులకు ఒకసారి నెంబరు.. దొరికేవి నాలుగైదు బిందెలు.. వారానికోసారి స్నానం.. ఇదీ.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ వాసుల పరిస్థితి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతో కాలనీలో ఒక్క మాత్రమే పని చేయడంతో మహిళలకు బిందెలు పెట్టి రాత్రి పగలు అక్కడే కూర్చోవడం తప్పడం లేదు. మంచినీళ్లు మహాప్రభో అంటూ పుర పాలకులను వేడుకుంటున్న ఒక్క ట్యాంకర్ నీటిని కూడా సరఫరా చేయడం లేదంటూ మహాత్మా గాంధీపై ఒట్టేసి చెబుతున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. look....
v.o...1: జహీరాబాద్ పట్టణానికి విసిరేసినట్టుగా ఉండే గాంధీనగర్ కాలనీ ఇటు ప్రజాప్రతినిధులు అటు పాలకులకు నిర్లక్ష్యమేనని చెప్పాలి పలుకుబడి ఉన్న నేతల కాలనీలకు మాత్రం రోజులో అడిగిన అన్ని సార్లు ట్యాంకర్లతో సరఫరా చేస్తున్న అధికారులు పేదల బస్తీల వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదు ఫలితంగా ఉన్న ఒక బోరు బావి మీదే ఆధారపడి 1000 నుండి 1500 మంది ప్రజలు నిత్యం నీటి కష్టాలు పడక తప్పడం లేదు. byte-1: శంకరమ్మ, కాలనీ మహిళా
v.o... 2: నాలుగు రోజులకోసారి వచ్చే నెంబర్ కోసం వచ్చే ఖాళీ బిందెలతో వరుస కోసం మహిళలు ఎదురు చూడక తప్పలేదు కూలి నాలి చేసుకుంటే కుటుంబం గడిచే పరిస్థితి ఉన్నా అవన్నీ మానేసి అక్కడే కూర్చోవలసి వస్తుంది అని గృహిణులు వాపోతున్నారు చిన్నారులను సైతం స్కూలుకు పంపకుండా నీళ్ళతోనే రోజంతా సరిపోతుందని వాపోతున్నారు ఎన్నికల వేళ ఇంటింటికి తిరుగుతూ మీకు మేమున్నాం అంటూ అడిగే ప్రజా ప్రతినిధులు మాత్రం నీతి కరువుతో అల్లాడుతున్న ఇటువైపు ఏ ఒక్కరూ రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. byte-2: పద్మ, కాలనీ వాసి
v.o.. 3: ట్యాంకర్ తో నీటిని సరఫరా చేయాలని కోరితే మీ కాలనీల్లో రోడ్లు బాగా లేవు ట్యాంకర్ రాదని అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు యువకులు ఆరోపిస్తున్నారు అంతర్గత దారులు బాగానే ఉన్నప్పటికీ పేదలు కదా ఏం చెబితే అది వింటారు అని చూపు చూస్తున్నారని ఆవేదన వెళ్లగక్కుతున్నారు మహాత్మా గాంధీ పేరున్న కాలనీ పై పురపాలికలు ఉన్నతాధికారులు దృష్టి సారించి నీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. byte-3: గోపాల్, యుకుడు
v.o.. 4: భూగర్భ జలాలు అడుగంటడంతో అన్ని కాలనీలకు నీటిని సరఫరా చేయడం పూర్తిగా సాధ్యపడడం లేదు పట్టణ ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని సహకరించాలని పురపాలక కమిషనర్ విక్రమ సింహ రెడ్డి సలహా ఇచ్చారు పేదలు ధనికులు అంటూ తమకు తేడాలు లేవని అందరికీ సమానంగా నీటిని పంపిణీ చేస్తామని వివరణ ఇచ్చారు నీటి సమస్య తీవ్రంగా ఉన్న కాలనీ సందర్శించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. byte-4: విక్రమసింహరెడ్డి, మున్సిపల్ కమిషనర్ జహీరాబాద్

Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా

Conclusion:8008573254
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.