కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నందున దుకాణాల సమయం తగ్గించాలని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు వర్తక సంఘం వ్యాపారులు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 60 మంది మహమ్మారి బారిన పడటం వల్ల సమావేశం నిర్వహించి తీర్మానం చేశారు.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరవాలని నిర్ణయించారు. అలాగే బొల్లారం మున్సిపల్ పరిధిలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తెరిచి ఉంచుతామని వర్తక సంఘం ప్రతినిధులు తెలిపారు.
ఇవీ చూడండి: హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్