తమ గ్రామంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి మండలం హనుమాన్‌నగర్‌కు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఉదయం పూట చెత్త వేయడానికి వచ్చిన ట్రాక్టర్లను అడ్డుకొని వెనక్కి పంపారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తమ గ్రామ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల గ్రామస్థులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని.. ఈగలు, దోమలు, కుక్కల బెడద ఎక్కువ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ స్పందించి పరిష్కారం చూపించాలని కోరారు.
ఇదీ చూడండి:ఈ ఊరికి మహాత్మా గాంధీ దేవుడయ్యాడు