సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్కి చెందిన పాత నేరస్తుడు బంటు ప్రసాద్.. నాగార్జున, హరికృష్ణ, మహమ్మద్ అమీర్తో ముఠాగా ఏర్పడి వాహనాలు చోరీకి పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు.
రహదారి కూడలిలో తనిఖీలు
ఈ నెల 27న బాహ్య వలయ రహదారి కూడలిలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న నలుగురిని విచారించారు. దొంగతనం చేశామని ఒప్పుకోవడం వల్ల వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి : 'ముస్లిం, మైనార్టీలు ఏ ఆధారాలు చూపించాలి'