సంగారెడ్డిలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవీమాత విగ్రహ ప్రతిష్ఠాపన కన్నుల పండువగా జరిగింది. తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవానికి పట్టణవాసులతో పాటు చుట్టు పక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారి ప్రతిష్ఠాపనోత్సవాన్ని వీక్షించిన భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులంతా కలిసి వాసవీ మాత గుడి నిర్మాణం చేపట్టడం పట్ల మాధవానంద సరస్వతి సంతోషం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : గోవింద్పూర్లో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం ప్లాంట్