సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మాలపాడు గ్రామ శివారులో గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. మహిళను ఎవరో అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ వయసు 35 నుంచి 40 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు.
ఘటనా స్థలానికి పరిసరాల్లో మద్యం సీసాలు లభించాయని సదాశివపేట సీఐ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు స్పష్టం చేశారు. మహిళ హత్య చేసిన ఘటనా స్థలాన్ని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి పరిశీలించి పరిస్థితి పై సమీక్షించారు.
ఇదీ చూడండి: వాళ్లకు అభ్యర్థులు లేరు.. అంశాలు లేవు: పల్లా