సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న పంటలను ఉగాండా దేశ వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పరిశీలించారు. మాచిరెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో రైతులు సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నారు.
అల్లం, మెంతి కూర, సొరకాయ, క్యాబేజీ, టమాటా పంటలను ఉగాండా అధికారులు పరిశీలించారు. సాగు విధానం, పెట్టుబడి, దిగుబడి వంటి విషయాలు రైతులను అడిగి తెలుసుకున్నారు.
- ఇవీ చూడండి: భాగ్యనగరానికి రాష్ట్రపతి కోవింద్.. ఘన స్వాగతం