శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేటలో రాష్ట్రపతి కోవింద్ దంపతులకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. మండలి ఛైర్మన్ గుత్తా, శాసన సభాపతి పోచారం, మంత్రులు స్వాగతం పలికారు. ఈనెల 28 వరకు రాష్ట్రపతి కోవింద్ సికింద్రాబాద్లోని బొల్లారంలో శీతాకాల విడిది చేయనున్నారు.
రేపు, ఎల్లుండి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కోవింద్ బస చేయనున్నారు. ఈనెల 22న రాత్రి రాజ్‌భవన్‌లో విందు గవర్నర్ తమిళిసై ఏర్పాటు చేయనున్న విందులో పాల్గొననున్నారు. అనంతరం 23 నుంచి 26 వరకు చెన్నై, పుదుచ్చేరి, తిరువనంతపురంలో పర్యటించనున్నారు. తిరిగి హైదరాబాద్ చేరుకుని ఈ నెల 28న దిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.