ETV Bharat / state

చిన్నారిని పెంచుకుంటున్నారని... పోలీసులకు ఫిర్యాదు చేశారు! - అక్రమ దత్తత తాజావార్తలు

సంగారెడ్డిలో రెండేళ్ల బాలుడిని నిబంధనలకు విరుద్ధంగా దత్తత తీసుకొని పెంచుకుంటున్న వ్యక్తులపై జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారిని శిశు విహార్​ కేంద్రానికి తరలించారు.

Illegal adoption is strict action
అక్రమ దత్తత తీసుకొంటే కఠిన చర్యలే..!
author img

By

Published : Jun 17, 2020, 9:02 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు సాయిరామ్ కాలనీలో శంకర్​ అనే వ్యక్తి చిలక జోస్యం చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని ఇంట్లోనే బంధువు అరుణ్ ఉంటూ హైటెక్ సిటీ ప్రాంతంలో పాత బట్టల వ్యాపారం చేసేవాడు. 2019 వినాయక చవితి రోజున హైదరాబాద్ ఇన్​ఆర్బిట్ మాల్ సమీపంలో అరుణ్ పాత బట్టల వ్యాపారం చేస్తుండగా... అతని వద్దకు రెండేళ్ల బాలుడు వచ్చాడు. చుట్టుపక్కల వెతికినా బాలునికి సంబంధించిన వారు కనిపించకపోవటం వల్ల బాలుడిని తీసుకొని ఇంటికి వచ్చాడు.

ఆ బాలుడిని పిల్లలులేని శంకర్ దంపతులకు అప్పగించాడు. అప్పటి నుంచి వారు ఆ బాబుని తమ వద్దే పెంచుకుంటున్నారు. స్థానికుల ఫిర్యాదుతో జిల్లా మహిళా సంక్షేమ అధికారులు దీనిపై విచారించారు. దత్తత నిబంధనలకు విరుద్ధంగా ఈ చిన్నారిని తీసుకొచ్చారని తెలియటంతో పటాన్​చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి ఆ చిన్నారిని సంగారెడ్డి శిశు విహార్​కు తరలించారు. బాలుడు నిజంగా దొరికాడా లేక ఎవరైనా విక్రయిస్తే తెచ్చుకున్నారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.