సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామ శివారులో ట్రాలీ ఆటో బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆటోలో నలుగురు మహిళలు ఉండగా ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు తంగేడపల్లి తండాకు చెందిన సోనీ, జాలీలుగా గుర్తించారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు రవాణా వ్యవస్థపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి :'సన్న బియ్యం పెడ్తామంటేనే బయటకొస్తాం'