సంగారెడ్డి జిల్లా ముత్తంగి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి వైపు నుంచి పటాన్ చెరు వస్తున్న ద్విచక్ర వాహన చోదకుడు అతివేగంగా వచ్చి వెనుకనుంచి మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీనివల్ల అతని తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మెరుగైన చికిత్స కోసం నలగండ్లలోని సిటిజన్ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుని కుమారుడు వెంకట శివప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.