సంగారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. హత్నూర మండలం లాక్మా తండాకు చెందిన మరోని అనే మహిళకు జ్వరం వచ్చింది. వైద్యం కోసం భర్తతో ఆటోలో సంగారెడ్డికి బయలుదేరారు. మార్గమధ్యలో ఆమె మృతి చెందింది.
దీంతో మృతదేహంతో పాటు ఆమె భర్త పాండు నాయక్‌ను ఆటో డ్రైవర్ నడిరోడ్డుపై దించేసి వెళ్లిపోయాడు. భార్య మృతదేహంతో పాండు నాయక్ గంటన్నరకు పైగా రోడ్డుపైనే రోదిస్తూ పడిగాపులు కాచాడు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి చరవాణితో కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు వాహనం తీసుకువచ్చి.. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.
ఇదీ చదవండి: సత్తా చాటిన పంత్, గిల్.. ఇషాంత్‌కు 3 వికెట్లు