సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనలో 10 తులాల బంగారం, ఒక కిలో వెండిని దొంగలు అపహరించుకుని పోయారు. నాగర్కర్నూల్ జిల్లా వాసి అయిన జయప్రకాశ్ రేగోడులోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. కుటుంబ సమేతంగా నారాయణఖేడ్లో అద్దె గదిలో నివాసం ఉంటున్నారు. వరుసగా మూడు రోజులు సెలవు కావడం వల్ల శుక్రవారం ఉదయం ఇంటికి తాళం వేసి స్వగ్రామానికి వెళ్లారు. రాత్రి దొంగలు ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుడికి సమాచారం అందించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: జగిత్యాలలో రెచ్చిపోయిన దొంగలు