ETV Bharat / state

పేదోడి సొంతింటి కల... గగనమే!

author img

By

Published : May 24, 2020, 9:56 AM IST

లాక్‌డౌన్‌ ప్రభావం గృహ నిర్మాణ రంగంపై తీవ్రమవుతోంది. దీంతో పేదోడి సొంతింటి కల సాకారం గగనంగా మారుతుంది. లాక్‌డౌన్‌కు ముందు.. ప్రస్తుతం గృహ నిర్మాణాలకు వినియోగించే సామగ్రి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రధానంగా సిమెంట్‌, ఇనుము, కంకర ధరలు పెరగడం వల్ల ఇంటి యజమానులకు మోయలేని భారంగా మారింది. మరోవైపు కూలీలు చాలామంది తమ స్వస్థలాలకు వెళ్లడం వల్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లాలో గృహ నిర్మాణ రంగం తీరుపై ఈటీవీ భారత్​ ప్రత్యేక’ కథనం.

sangareddy district latest news
sangareddy district latest news

ఇటీవల లాక్‌డౌన్‌లో నిర్మాణ రంగాలకు సడలింపు ఇవ్వడం వల్ల ఊరట దక్కినా... ఆయా గృహ నిర్మాణ రంగాల పనులు పెద్దగా ఊపందుకోవడం లేదు. రానున్నది వానా కాలం... అప్పటిలోపు నిర్మాణాలు పూర్తి కావటంపై ఇంటి యజమానుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది.

పెరిగిన ధరలు...

ఇంటి నిర్మాణాలకు సిమెంట్‌, స్టీలు, ఇటుక, కంకర, తలుపులు, కిటికీలు ఇలా గృహ పరికరాలు కీలకం. ఆయా పరికరాల ధరలు లాక్‌డౌన్‌కు ముందు ప్రస్తుతం ధరలు రెండింతల మేరకు పెరగడం గమనార్హం. లాక్‌డౌన్‌కు మందు సిమెంట్‌ బస్తాకు రూ.280 ఉండగా ప్రస్తుతం రూ.380 ధర పలుకుతుంది. ఇనుము టన్నుకు రూ.45 వేలు ఉండగా ప్రస్తుతం రూ.46 వేలకు వెళ్లింది. కంకర 10 నుంచి 12 టన్నులకు టిప్పర్‌కు విఫణిలో రూ.5,500 ఉండగా... ప్రస్తుతం రూ.6 వేలకు వెళ్లింది. ఇసుక, ఇటుక ధరల్లో పెంపులో పెద్దగా తేడాలేదు.

గతంలో లారీల కొలది సిమెంట్‌, స్టీలు వ్యాపారం జరిగేదని.. ప్రస్తుతం రోజుకు పది బస్తాల సిమెంట్‌.. పది టన్నుల ఇనుము విక్రయాలు కూడా జరగడం లేదని సంగారెడ్డికి చెందిన వ్యాపారి ఖలీల్‌ హుస్సేన్‌ వాపోయారు. లాక్‌డౌన్‌తో వ్యాపారం దెబ్బతిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేధిస్తున్న కూలీల కొరత..!

జిల్లాలో భవన నిర్మాణాల పనుల్లో సుమారు 30 వేల మంది కార్మికులు ఉంటారని కార్మిక శాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారు. అదనంగా ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులు 3 నుంచి 4 వేల మంది వరకు పని చేస్తున్నారు. వీరిలో చాలామంది లాక్‌డౌన్‌ వల్ల వారి వారి స్వస్థలాలకు వెళ్లారు. దీనివల్ల ఆయా భవన నిర్మాణాల పనులు నిలిచాయి. అడ్డమీది కూలీలు సైతం రోజు వచ్చి పోతున్నారు. వారికి పని కల్పించే వారు లేరు.

అసలు నిర్మాణ రంగంలో తాపీమేస్త్రీలు కీలకం. వారిలో సగానికి కంటే పైగా ఏపీ, ఇతరత్రా రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ స్థిరపడ్డారు. వారంతా స్వస్థలాలకు వెళ్లారు. వారు వస్తారా? రారా? అనేది ఇప్పట్లో చేప్పలేక పోతున్నామని గుత్తేదారులు పేర్కొంటున్నారు.

సగంలో పనులు ఆగాయి...

ఫిబ్రవరిలో పాత ఇంటిని కూల్చివేసి రూ.6 లక్షలతో కొత్తింటి నిర్మాణం ప్రారంభించాం. దీనికి రాయి, ఇసుక, సిమెంట్‌ తదితర సామగ్రి కోసం ఇప్పటి వరకే రూ. 2 లక్షలుకు పైగా ఖర్చయింది. ప్రస్తుతం రూఫ్‌ లేవల్‌లో పనులు నిలిచిపోయాయి. స్లాబ్‌ వేయడానికి స్టీలు, సిమెంట్‌ ఇతర సామగ్రికి ధరలు పెరగటం వల్ల భారంగా మారింది. వానాకాలంలోపు పనులు పూర్తవుతాయోలేదోనని ఆందోళనగా ఉంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలి.

- తలారీ సుజాత, తాళ్లపల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.