సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి శ్రీ ఎల్లమ్మ ఆలయంలో పంచమ వార్షిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి నేడు బోనాలు సమర్పించారు. ధూప దీప నైవేద్యాలతో భక్తులు శాంతిపజేశారు. సుగంధ పరిమళ ద్రవ్యాలతో పూజించారు.
దేవాలయంలో గత కొన్ని రోజుల నుంచి హోమాలు, కుంకుమార్చన కార్యక్రమాలను ఆలయ నిర్వాహకులు జరిపారు. అమ్మవారికి ఒడిబియ్యంతో మొక్కులు చెల్లించుకున్నారు. దేవత ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు.
ఇదీ చూడండి: యాదాద్రి పాతగుట్టలో కన్నులపండువగా వార్షిక బ్రహ్మోత్సవాలు