సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం వేముకుంటలో వందశాతం పూర్తయిన మిషన్ భగీరథ పనులను ఇంజనీరింగ్ చీఫ్ కృపాకర్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తోన్న మిషన్ భగీరథ నీరు చాలా స్పష్టమైనదని ఆయన పేర్కొన్నారు. ముందుగా జిల్లాలోని 3 గ్రామాలను మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్ది... తర్వాత జిల్లా అంతా మోడల్‌గా తయారు చేయాలని 100 రోజుల ప్రణాళిక రూపొందించామని ఆయన తెలిపారు. మిషన్ భగీరథపై ప్రజల్లో అవగాహన ఎలా పెంచాలి, పనులు ఎలా పూర్తి చేయాలి అనే అంశాలపై అధికారులకు ఆయన అవగాహన కల్పించారు.
ఇదీ చూడండి: సిబ్బంది విధుల బహిష్కరణ... నిర్మానుష్యంగా కార్యాలయాలు