ETV Bharat / state

టీ దుకాణంలో హత్యపై పోలీసు విచారణ.. - TEA SHOP MURDER INVESTIGATION

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామ శివారు పరివార్ దాబా ముందు టీ దుకాణంలో జరిగిన హత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు.

హాజీ కుటుంబ సభ్యులను విచారిస్తున్న పోలీసులు

author img

By

Published : Feb 8, 2020, 7:00 AM IST

Updated : Feb 8, 2020, 7:20 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలో మృతుడు మహమ్మద్ హాజీ కుటుంబీకులను పిలిపించిన పోలీసులు... వ్యక్తిగత వివరాలు సేకరించారు. హాజీ రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరికీ విడాకులు ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. 15 రోజులకోసారి బోరబండలో ఉన్న తల్లి యోగక్షేమాలు చూసేందుకు వచ్చేవాడని పేర్కొన్నారు. వారం రోజుల క్రితం గొడవ జరిగిందని అందులో హాజీకి స్వల్ప గాయాలైనట్లు సోదరుడికి తెలిపినట్లు వెల్లడించారు.

రెండు కేసులు... ఇంకెన్నో !

హాజీపై రహదారి ప్రమాదం, వరకట్న వేధింపులకు సంబంధించి రెండు కేసులు నమోదైనట్లు తెలియడం వల్ల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. మరో హత్యాయత్నం కేసులో ప్రమేయం ఉందన్న అనుమానంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు ఠాణాల్లో విచారిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అశోక్​కు మెదడులో రక్తం గడ్డ కట్టడం వల్ల గాంధీ ఆసుపత్రికి తరలించి శస్త్ర చికిత్స చేశారు. 48 గంటలు గడిస్తే గాని పరిస్థితి చెప్పలేమని గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

హాజీ కుటుంబ సభ్యులను విచారిస్తున్న పోలీసులు

ఇవీ చూడండి : అక్కన్నపేటలో ఏకే47 తో కాల్పులు.. నిందితుడు అరెస్టు

Last Updated : Feb 8, 2020, 7:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.