సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో కాల్పులు జరిపి ప్రజలను భయాందోళనకు గురి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కోహెడ మండల పరిధిలో నిందితుడు సదానందం అనే వ్యక్తి ఏకే47 తుపాకీతో కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.
నిందితునితో పాటు... కాల్పులకు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. సదానందం ఇంట్లో పోలీసులు సోదా చేయగా... కార్బన్ తుపాకీ లభ్యమైంది. నిందితున్ని అదుపులోకి తీసుకుని... సిద్దిపేటకు తరలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. ఎవ్వరికీ ఎలాంటి గాయాలు జరగకపోవటం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చూడండి: 'ఐదుగురికి ఉరిశిక్ష వేయడం అభినందనీయం'