రాష్ట్రంలో మహిళల పట్ల ఆకృత్యాలు పెరిగిపోతున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని తెదేపా జిల్లా యువత అధ్యక్షుడు ఎడ్ల రమేశ్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెదేపా నాయకులు చేపట్టారు. ఆందోళన చేస్తున్న నాయకులను పటాన్చెరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
దిశ హత్యకేసులో పోలీసులు చేసిన పనిని చూపిస్తూ.. సర్కారు గొప్పలు పోతోందని.. మిగతా మహిళల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెదేపా నాయకులు ఆరోపించారు. ప్రజలకు హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోలేక పోయారని దుయ్యబట్టారు.
ఇదీ చూడండి : సంక్షేమ బోర్డు.. సరకుల రవాణా.. బస్సుల తగ్గింపు!