ETV Bharat / state

'ప్రజల సహకారంతోనే ప్లాస్టిక్ రహిత పట్టణాలు సాధ్యం' - సంగారెడ్డిలో స్వచ్ఛసర్వేక్షన్​ అవగాహన ర్యాలీ

స్వచ్ఛ సర్వేక్షన్​ 2021లో భాగంగా అమీన్​పూర్ మున్సిపల్ పరిధి బీరంగూడ కమాన్​ నుంచి గుట్ట కమాన్​ వరకు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్​ ఛైర్​పర్సన్ తుమ్మలపాండురంగారెడ్డి, మున్సిపల్​ కమిషనర్​ సుజాత ఆధ్వర్యంలో స్వచ్ఛసర్వేక్షన్​ ర్యాలీ చేశారు.

అమీన్​పూర్​ మున్సిపల్​ పరిధిలో స్వచ్ఛసర్వేక్షన్​​ ర్యాలీ

author img

By

Published : Feb 2, 2021, 11:36 AM IST

పట్టణాలను ప్లాస్టిక్​రహితంగా మార్చడంలో వ్యాపారులు, ప్రజలు భాగస్వాములు కావాలని అధికారులు సూచించారు. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మున్సిపల్​ పరిధిలో స్వచ్ఛసర్వేక్షన్​​ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్​ ఛైర్​పర్సన్​ తుమ్మలపాండురంగారెడ్డి, కమిషనర్​ సుజాత ఆధ్వర్యంలో బీరంగూడ కమాన్ నుంచి గుట్ట కమాన్​ వరకు ర్యాలీ చేశారు.

పర్యావరణ పరిరక్షణ కోసం తడి, పొడి చెత్త నిర్వహణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షన్​ జిల్లా కోఆర్డినేటర్​ వెంకటేశ్​నాయక్​, మున్సిపల్​ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'నా భర్త చదివిన పాఠశాల వద్ద ఓ ఫొటో తీయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.