Summer Camp In Sangareddy for Kids : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన వైద్య దంపతులు విజయలక్ష్మి శివబాబు తమ చిన్నారులు ర్యాంకుల చదువుల్లో చిక్కుకోవడం గుర్తించారు. బాల్యంలోని మధురానుభూతుల నుంచి వారు దూరం అవడం ఆ తల్లిదండ్రులను ఆలోచింప చేసింది. తమ పిల్లలతో పాటు ఇతర విద్యార్థులకు తమవంతుగా ఏదైనా చేయాలన్న సంకల్పంతో 'మన లైబ్రరీ' పేరుతో ఓ సంస్థను స్థాపించారు. దీని ద్వారా విద్యార్థులకు తమ పోటీ చదువుల వల్ల కోల్పోయిన వాటిని తిరిగి వారికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. గత 15 ఏళ్లుగా ప్రతి వేసవిలో ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహించి.. చిన్నారుల్లో దాగిన ప్రతిభను వెలికి తీసి.. దానికి పదును పెడుతున్నారు.
Summer Children Camp In Sangareddy : విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి దోహదపడేలా ఈ వేసవి శిబిరంలో వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తారు. నేటి యాంత్రిక, టెక్కీ ప్రపంచం నుంచి విద్యార్థులను బయటికి తీసుకువచ్చి.. చేతులతో చేయడం.. హృదయంతో స్పందించడం.. ఆలోచించడం అనేవి విద్యార్థులకు నేర్పిస్తారు. కథలు చెప్పడం, కథలు రాయడం, మట్టితో బొమ్మలు చేయడం, పేపర్లతో ఆర్టికిల్స్ తయారు చేయడం, చిత్రలేఖనం, తోలుబొమ్మలాట, బుర్రకథ, ఏకాగ్రత శిక్షణ, వక్తృత్వం.. సరద ఆటలు, పాటలు ఇలా ఒక్కటేమిటి.. చిన్నారులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తారు.
Kids Summer Camp in Sangareddy : విన్నూత్నమైన అంశాలతో నిర్వహించే ఈ వేసవి శిబిరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అమ్మమ్మ, అంటీ, అంకుల్ అంటూ విద్యార్థులు శిక్షకులను బంధుత్వాలతో పిలుస్తుండటంతో.. కుటుంబ వాతావరణంలా ఉంటోంది. కేవలం జహీరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే కాదు.. ఇతర ప్రాంతాల నుంచి సైతం విద్యార్థులు శిబిరంలో పాల్గొంటున్నారు. మొదటిసారి వచ్చిన విద్యార్థులు వచ్చే సంవత్సరం సైతం తప్పనిసరి వస్తామని స్పష్టం చేస్తున్నారు.
'ఈరోజుల్లో ఎవరి తల్లిదండ్రులను అడిగినా పిల్లలు అసలు చదవట్లేదు.. తమ పిల్లలు ఫోన్ చూస్తారు అంటుటారు. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా మా వేసవి శిబిరాల అనుభవాలు చెబుతున్నారు. పిల్లల ముందు మట్టి పెడితే చక్కటి బొమ్మలు చేస్తున్నారు. పుస్తకాలు పెడితే చదువుతున్నారు.. అలాగే చెబుతున్నారు. కథలు కొత్తగా చెబుతున్నారు. పాటలు పాడుతున్నారు.. రాని పాటలు నేర్చుకుంటున్నారు'. - డాక్డర్ విజయలక్ష్మి, లైబ్రరీ వ్యవస్థాపకురాలు
Summer Camp for Kids : వేసివి శిబిరం ముగిసే నాటికి విద్యార్థుల్లో స్పష్టంగా మార్పు కనిపిస్తోంది. చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలు పెరగడంతో పాటు, సృజనాత్మకత పెరుగుతోందని నిర్వాహకులు వివరిస్తున్నారు. శిబిరంలో పాల్గోన్న విద్యార్థులు రాసిన కథల్లోంచి కొన్నింటిని ఎంపిక చేసి పుస్తకాలుగా ముద్రిస్తున్నారు. ఇప్పటికే జహీరాబాద్ పిల్లల కథలు-1, 2, 3 పేర్లతో మూడు పుస్తకాలు ముద్రించారు. వీటికి మంచి స్పందన లభించింది.
Kids Summer Camp : విద్యార్థులకు బాల్యంలోని మధుర స్మృతులు అందించాలని.. వారిలో సృజనాత్మకత పెంచాలన్న లక్ష్యంతో నిర్వాహకులు వేసివి శిబిరం నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లోనూ ఇదే తరహా విద్యావిధానం ఉండాలని వారు అభిలాషిస్తున్నారు.
ఇవీ చదవండి: