ETV Bharat / state

చక్కెర కర్మాగార యాజమానిని అడ్డుకున్న రైతులు - seetharama marriage celebrations

తమకు రావాల్సిన బకాయిల కోసం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో చెరకు రైతులు ఆందోళన చేపట్టారు. యజమానిని అడ్డుకున్నారు. వచ్చే రెండు రోజుల్లో పెండింగ్ నిధులు చెల్లిస్తామని యాజమాన్యం హామీతో ఆందోళన విరమించారు.

formers
author img

By

Published : Apr 14, 2019, 11:33 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో బకాయిలు చెల్లించాలని చెరకు రైతులు నిరసన చేపట్టారు. మధునగర్​లో కోదండ రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించగా పాల్గొన్న ట్రైడెంట్ చక్కెర కర్మాగారం యజమానిని చెరుకు రైతులు నిలదీశారు. అనంతరం కారును అడ్డుకున్నారు. గానుగకు చెరకు తరలించి నెలలు గడుస్తున్నా బిల్లులు చెల్లించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్మాగారంలో దశాబ్దాలుగా సహాయ మేనేజర్ ఇతర అధికారులు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సోమ, మంగళవారాల్లో సమావేశం నిర్వహించి బిల్లుల చెల్లింపుపై నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ఇందుకు అంగీకరించిన రైతులు ఆందోళన విరమించారు.

చెరకు రైతులు ఆందోళన

ఇవీ చూడండి : కాగజ్​నగర్​లో పోలీసులు వినూత్న ప్రయత్నం

Intro:tg_srd_58_14_kalyanam_ab_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) సంగారెడ్డి పట్టణంలోని రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా.. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలపై శ్రీరామ చంద్రుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని.. ఈ ఆలయం తో తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు. నవంబర్ తర్వాత ఇంటింటికి తిరిగి.. ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Body:బైట్: జగ్గారెడ్డి, శాసనసభ్యుడు, సంగారెడ్డి

Conclusion:విజువల్, బైట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.