ETV Bharat / state

పవర్‌ లిఫ్టింగ్ క్రీడాకారిణి రేఖ... ది స్ట్రాంగ్ ఉమన్‌!

author img

By

Published : May 3, 2021, 6:08 PM IST

మగువల జీవితం పెళ్లి ముందు ఒకలా.. పెళ్లి తరువాత మరోలా ఉంటుంది. అప్పటివరకు తను కన్న కలల్ని కుటుంబం కోసం వదిలేసే వారు కొందరైతే... మరికొందరు పెళ్లి తరువాతే మరింత ఉత్సాహంగా కెరీర్‌ను తీర్చిద్దిద్దుకుంటారు. ఆ జాబితాకే చెందిన యువతి...రేఖ. పవర్‌ లిఫ్టింగ్‌లో అంచెలంచెలుగా ఎదిగి స్ట్రాంగ్‌ ఉమన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల జరిగిన సీనియర్‌ జాతీయ పవర్‌ లిప్టింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో బంగారు పతకం కైవసం చేసుకుంది. అంతర్జాతీయస్థాయిలో దేశానికి పతకమే ధ్యేయంగా సన్నద్ధమవుతోంది... స్ట్రాంగ్‌ ఉమన్‌ రేఖ ఇంటూరి.

story on powerlifting athlete rekha inturi from sangareddy district
పవర్‌ లిఫ్టింగ్ క్రీడాకారిణి రేఖ... ది స్ట్రాంగ్ ఉమన్‌!
పవర్‌ లిఫ్టింగ్ క్రీడాకారిణి రేఖ... ది స్ట్రాంగ్ ఉమన్‌!

పవర్ లిఫ్టింగ్‌లో అవలీలగా పతకాలు సాధిస్తున్న ఈమె పేరు.. రేఖ. గెలుపు తప్ప ఓటమిని అంగీకరించని తెగువ తన సొంతం. అందుకు నిదర్శనమే ఇక్కడ కనిపిస్తున్న పతకాలు.. ప్రశంసా పత్రాలు.

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంకు చెందిన రేఖకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఇష్టం. ఖోఖో, కబడ్డీ ఆటలు బాగా ఆడేది. జట్టులోని ఒకరిద్దరు సరిగ్గా ఆడకపోయినా ఫలితం మెుత్తం జట్టుమీద పడేది. అందరిలో ఒకే తపన లేనప్పుడు గెలుపు కష్టమని అర్థం చేసుకున్న రేఖ క్రమంగా వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకుంది.

ఆమె ప్రస్థానం...

ఒకసారి రోడ్డు ప్రమాదంలో రేఖ కుడి భుజానికి గాయమైంది. దీంతో కొన్ని నెలల పాటు వెయిట్‌లిఫ్టింగ్‌కు దూరం కావాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే పవర్‌లిఫ్టింగ్‌ గురించి తెలుసుకుంది. ఈ ఆటకు గాయం అడ్డురాదని గ్రహించి పవర్‌ లిప్టింగ్‌లో శిక్షణ ప్రారంభించింది. అలా... 2004లో పాటియాలాలో జరిగిన జాతీయ సబ్‌ జూనియర్ పోటీల్లో 57కిలోల విభాగంలో తొలిసారిగా పసిడి గెలుచుకుంది. 2005లో అమృత్‌సర్‌లో జరిగిన అలిండియా ఇంటర్‌ యూనివర్శిటీ పోటీల్లో 67కిలోల కేటగిరిలో స్వర్ణం సాధించి, బెస్ట్‌ పవర్‌ లిప్టర్‌ టైటిల్‌ దక్కించుకుంది.

అడుగడుగునా కష్టాలే...

బంగారు పతకం సాధించిందని తెలిసి రమాదేవి అనే మహిళా రేఖను సంప్రదించి ఫిట్‌నెస్‌ శిక్షకురాలిగా అవకాశం కల్పించారు. అలా... ఇంటర్‌లో ఉన్నప్పుడే ఉద్యోగ జీవితం ప్రారంభం అయింది. తన కెరీర్‌ మెరుగ్గా ఉన్న దశలోనే ప్రేమ వివాహం చేసుకుంది. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితాన్ని మెుదలుపెట్టిన ఆమెకు... అడుగడుగునా కష్టాలే పలుకరించాయి.

రేఖ సాధన మెుదలిలా...

కష్టాలు దిగమింగుకుని మళ్లీ 2014లో మరోసారి రేఖ సాధన మెుదలుపెట్టింది. 2015లో సీనియర్‌ కేటగిరీలో 84 కిలోల విభాగంలో జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. అయినా, అనుకోని పరిణామాలతో 2015లో మళ్లీ ఆటకు దూరమైంది. మళ్లీ 2020 నవంబర్‌లో కోచ్‌ సుమీత్‌ దగ్గర మళ్లీ సాధన మెుదలుపెట్టి.. ఈ ఏడాది మెుదట్లో జరిగిన జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పసిడి పతకాలు సాధించింది. మార్చిలో జంషెడ్‌పూర్‌లో జాతీయ పోటీల్లో అంతకుముందున్న రికార్డులు బద్దలుకొట్టి... స్ట్రాంగ్‌ ఉమన్‌ టైటిల్‌ సొంతం చేసుకుంది.

ఎందరో క్రీడకారులకు.. స్ఫూర్తి

జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు అధిగమించలేక... ఒకనొక సమయంలో ఆత్మహత్య ఆలోచన కూడా చేసినట్లు చెబుతోంది రేఖ. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల అండతో మళ్లీ పవర్‌ లిఫ్టింగ్‌ వైపు అడుగులు వేశానని అంటోంది. రేఖ తమ అకాడమీలో 8 సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకుంటోందని.. తనవద్ద శిక్షణ పొందుతున్న ఎందరో క్రీడకారులకు.. రేఖస్ఫూర్తిగా నిలుస్తోందని కోచ్ సుమిత్‌ చెబుతున్నారు.

రేఖ ముందున్న లక్ష్యమదే..

ఈ ఏడాది ఆసియా పవర్‌ లిప్టింగ్‌ చాంఫియన్‌ షిప్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించింది రేఖ. ఆర్థిక ఇబ్బందులతో ఆ పోటీలకు వెళ్లలేకపోయింది. భవిష్యత్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా పవర్‌లిఫ్టింగ్‌ కమ్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ అకాడమీ ఏర్పాటు చేయడమే రేఖ ముందున్న లక్ష్యం.

ఇదీ చదవండి: ప్రజా రవాణాపై కరోనా ప్రభావం.. వైరస్​కు బలవుతున్న ఉద్యోగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.