మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతారెడ్డి పేర్కొన్నారు. సమాజమంతా బాల్య వివాహాలను అరికట్టడాన్ని ఓ బాధ్యతగా తీసుకోవాలన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నస్తీపూర్ గ్రామంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సునీతారెడ్డి సూచించారు. బాల్య వివాహాల వల్ల అమ్మాయిలు.. అనారోగ్యం పాలవుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మధన్‌రెడ్డి, అదనపు కలెక్టర్ రాజాశ్రీ, తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మానుకోట రాళ్ల కిందే సమాధి చేస్తాం: సత్యవతి