కేంద్ర ప్రభుత్వం కనీస పింఛన్‌గా రూ. 9 వేలు ఇవ్వాలని పెన్షనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైకుంఠ రావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు భవిష్య నిధి కార్యాలయం ముందు జిల్లా పెన్షనర్ల సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం పీఎఫ్ కార్యాలయం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని వైకుంఠ రావు డిమాండ్ చేశారు. నిజ వేతనాల మీద లెక్కించి పింఛన్ అందజేయాలని కోరారు. పెన్షన్ మీద డీఏ కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని వైకుఠ రావు అభ్యర్థించారు.
ఇదీ చదవండి: ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్లో కోతకు ఆర్డినెన్స్