తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో గ్రామస్థులు ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. గ్రామంలోని కొత్త కాలనీలో తాగునీటి పంపులు పనిచేయక గత పక్షం రోజులుగా నీటి సరఫరా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి : చేప పిల్లలు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి