ETV Bharat / state

అబ్బాయి కాదు అమ్మాయే.. కొడుకులాంటి కూతురి కథ!

author img

By

Published : Dec 15, 2020, 9:25 AM IST

ఆ ఆటో డ్రైవర్‌ను చూస్తే అబ్బాయే అనుకుంటారు. మాట్లాడితేగానీ అర్థంకాదు... అతడు కాదు ఆమె అని. ఆమె ఆటో డ్రైవర్‌గా బతకడం వెనక, ఆహార్యం మార్చుకుని ఉండడం వెనక ఓ బాధ్యత ఉంది. అసాధారణ బతుకు పోరాటం ఉంది.

KAVITHA
కొడుకులాంటి కూతురి కథ!

‘ఎందుకు బిడ్డా ఇక్కడ కష్టంగా ఉంది, నువ్వు అక్కడే ఉండకపోయావా’... ఇది ఓ తండ్రి కూతురితో అన్న మాటలు.

అత్తింట్లో భర్త పెట్టే బాధలు భరించలేక పుట్టింటికి వచ్చిన కూతురికి ఓదార్పునివ్వలేని, కనీసం కడుపు నిండా అన్నం పెట్టలేని కడు పేదరికం ఆ కుటుంబానిది. అందుకే అంత కష్టంలో వచ్చిన కన్నబిడ్డతో తండ్రి ఆ మాటలన్నాడు.

పేదరికమనే చిమ్మచీకట్లో కునారిల్లుతున్న ఆ కుటుంబానికి ఆ అమ్మాయే వెలుగుల దివ్వె అయింది. వారికి ఆదరువు అయింది. దీని కోసం తన అలవాట్లనే కాదు, ఆహార్యాన్నీ మార్చుకుంది.

నారాయణఖేడ్‌కు చెందిన వసంత్‌నాయక్‌, మాలీబాయిల మూడో సంతానం కవితా రాఠోడ్‌. మొత్తం ఎనిమిది మంది ఆడపిల్లలు వారికి. అబ్బాయి కోసం ఎదురుచూస్తూ అంతమందికి తల్లిదండ్రులయ్యారు. ఇంట్లో పొయ్యి వెలగాలంటే రోజంతా కూలిపని చేయాల్సిందే. అప్పటి తమ పరిస్థితులను, తాను ఆటో డ్రైవర్‌గా మారిన తీరునీ ఇలా వివరిస్తోంది కవిత...

కవితా రాఠోడ్‌

అయిదేళ్లపుడే మేకలు, గొర్రెలను మేపడానికీ, ఏడో ఏటనుంచి చెరకు గడలు నరికే పనికీ వెళ్లేదాన్ని. అలా రోజుకి వచ్చే ఎంతోకొంత చిల్లరను అమ్మకు తెచ్చిచ్చేదాన్ని. ఇలా చిన్నప్పట్నుంచీ అమ్మానాన్నలకు తోడుగా ఎంతోకొంత సంపాదించి ఇచ్చేదాన్ని. ఉన్నంతలో అక్కలిద్దరికీ పెళ్లిళ్లు చేశారు అమ్మానాన్న. నాకు పదేళ్లకే పెళ్లి చేశారు. మద్యానికి బానిసైన నా భర్త నన్ను రోజూ కొట్టి హింసించేవాడు. అకారణంగా కొడుతుంటే ఆ బాధని తట్టుకోలేక అయిదురోజులకే పుట్టింటికి వచ్చేశా. ‘ఆ దెబ్బలు భరించడం నా వల్లకాదు, కలోగంజో తాగి ఇక్కడే ఉంటా. మీతోపాటు కష్టపడతా’ అని చెప్పా. నా భర్త ప్రవర్తన గురించి అమ్మానాన్న పెద్దలకు చెబితే వాళ్లు విడాకులు ఇప్పించేశారు.

ఆరోజునుంచి అమ్మానాన్నలతోపాటు నేనూ ఇంటి బాధ్యతను తీసుకున్నా. రోజూ కూలీ పనులకెళ్లేదాన్ని. నాకు 17 ఏళ్లప్పుడు అమ్మకు సుస్తీ చేసి చనిపోయింది. అప్పటికి పెళ్లికావాల్సిన అయిదుగురు చెల్లెళ్లున్నారు. అంతకుముందే నాన్న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ‘కుటుంబాన్ని ఎలా లాక్కురావాలి, ఆడపిల్లలకెలా పెళ్లిళ్లు చేయాలి’ అంటూ అమ్మపోయిన రోజు నాన్న బోరున ఏడ్వడం నా మనసును కలిచివేసింది. ‘నేను తోడుంటా చెల్లెళ్ల బాధ్యత తీసుకుంటా’నని అప్పుడు నాన్నకి మాటిచ్చా.

కొడుకులాంటి కూతురి కథ!

ఆటోతో హైదరాబాద్‌లో...

కూలీ పనులతో అయిదుగురు చెల్లెళ్ల పెళ్లిల్లు చేయడం సాధ్యం కాదనిపించింది. మా మేనమామ ఆటో నడిపేవాడు. అప్పటికే సరదాగా ఆయన దగ్గర ఆటో నడపడం నేర్చుకున్నా. దాన్నే ఉపాథిగా మార్చుకోవాలనుకుని పదేళ్లకిందట హైదరాబాద్‌ వచ్చా. నాతోపాటు ఆటోని ఊరునుంచి అద్దెకు తెచ్చుకున్నా. మియాపూర్‌ దగ్గర్లో చిన్నగది అద్దెకు తీసుకున్నా. నగరంలో అమ్మాయిలా చుడీదార్‌ వేసుకుని ఆటో నడిపితే ఇబ్బందిపడాల్సి వస్తుందని క్రాఫ్‌ మార్చుకుని, ప్యాంటూచొక్కా వేసుకుని చూడ్డానికి అబ్బాయిలా తయారయ్యా. కొత్తవాళ్లెవరూ నన్ను అమ్మాయనుకోరు.

ఆరోజు ఆటోస్టాండ్‌లో ఆటోను నిలిపినప్పుడు అక్కడున్నవాళ్లు ‘తిరిగి ఊరెళ్లకపోతే నీ ఆటో ఉండద’ని బెదిరించారు. వాళ్ల దృష్టిలో పడకుండానే మియాపూర్‌-బాచుపల్లి మధ్య ఆటో నడిపేదాన్ని. 12 గంటలపాటు కష్టపడితే ఆటోకు అద్దె, డీజిల్‌ ఖర్చు పోగా రూ.500 మిగిలేది. ఆటో నడుపుతూనే ఇప్పటివరకు నలుగురి చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేయగలిగా. ఇంతలో నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లకు ఇద్దరు మగపిల్లలు. వారి బాగోగులూ నేనే చూస్తున్నా. కుటుంబంలో ఎవరికీ అక్షరం ముక్కరాదు. అందుకే మా చిన్న చెల్లిని స్కూల్లో చేర్పించా. ఎనిమిదో తరగతి చదువుతోందిప్పుడు. పెళ్లిళ్లు, ప్రసవాలు, అనారోగ్యాలు... ఇలా బాధ్యతలెక్కువయ్యాయి. వాటితోపాటు అప్పూ పెరిగిపోయింది. దాన్ని తీర్చాల్సిన బాధ్యతా నాదే. నన్ను తిరిగి పెళ్లెందుకు చేసుకోవని చాలామంది అడుగుతారు. ఒకవేళ చేసుకుంటే ఆ వ్యక్తి నా కుటుంబాన్ని తన బాధ్యతగా తీసుకుంటాడనే నమ్మకం నాకు లేదు. నాన్నకిచ్చిన మాట నిజం చేయాలంటే నేనిలాగే ఉండాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.