సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అదృశ్యం కావడం వల్ల అతని సోదరుడు పటాన్చెరు పీఎస్లో ఫిర్యాదు చేశాడు.పటాన్చెరు మండల కేంద్రంలోని ఇంద్రేశం కాలనీకి చెందిన మధుసూదన్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి అమీర్పేట్లో ఏదో పని ఉందని ఈనెల 12వ తేదీన ఇంటి నుంచి బయల్దేరాడు. అతని సోదరుడు భాస్కర్ పటాన్చెరు బస్టాండ్ లో అతనిని వదిలి పెట్టాడు. మధ్యాహ్నం భార్య సంధ్యారాణి ఫోన్ చేసేసరికి మళ్లీ చేస్తానని మధుసూదన్ ఫోన్ పెట్టేశాడు.
అనంతరం ఫోన్ చేసినా.. అతని రెండు నెంబర్లు స్విచ్ఛాఫ్ చేసి ఉన్నాయి. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. అతని సోదరుడు భాస్కర్ బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో బుధవారం పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: ఘరానా మోసం.. రైతుల నుంచి రూ.2 లక్షలు స్వాహా