సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని నారాయణరెడ్డి కాలనీలో సుమారు 60 మంది నిరుపేద కుటుంబాలకు ఎస్సై ప్రసాద్ బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ప్రజలంతా భౌతిక దూరాన్ని పాటిస్తూ.. కూరగాయలను తీసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రజలంతా లాక్‌డౌన్‌ను పాటించాలని ఎస్సై కోరారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
ఇదీ చూడండి: 'మోదీజీ... గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని రప్పించండి'