అయోధ్యలో రామమందిర నిర్మాణ నిధి సేకరణ కోసం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జనజాగరణ ర్యాలీని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాహనంపై రాముని చిత్రపటంతో కాలినడకన కాషాయ జెండాలు పట్టుకుని... వీధిల్లో శ్రీ రామ నామ జపం చేస్తూ ముందుకు సాగారు.
సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించే ఈ ర్యాలీలో హిందూ బంధువులందరూ పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. ఇస్కాన్ దేవాలయం సభ్యులు సైతం పాల్గొని శ్రీరామ సంకీర్తనలు ఆలపించారు.
ఇదీ చదవండి: కన్నుల పండువగా సాగిన శ్రీరామ నామ సంకీర్తన ర్యాలీ