సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రంలో ఓ ఏడు నెలల చిన్నారి కరోనా వ్యాధితో మరణించింది. అస్వస్థతకు గురైన ఆ చిన్నారిని అనేక ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. చివరకు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరోనా వ్యాధితో మృతి చెందింది. వైద్యులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు అదే రోజు రాత్రి అంత్యక్రియలు జరిపారు.
నీలోఫర్ వైద్యులు ఇచ్చిన రిపోర్టులో కరోనా వచ్చిందని హత్నూర ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు నాగజ్యోతికి ఈమెయిల్ చేశారు. అప్రమత్తమైన వైద్యులు చిన్నారి కుటుంబాన్ని కలుసుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమాచారం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అక్కడకు చేరుకుని కాలనీని పరిశీలించారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని సూచించారు. కావల్సిన నిత్యావసరాలు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యవేక్షణ చేయాలని ఎస్సై శ్రీనివాస్‌కు తెలిపారు. అంత్యక్రియలకు వచ్చిన కొందరు బంధువులు, కుటుంబ సభ్యులు 32 మందిని పరీక్షల నిమిత్తం తరలించామని కలెక్టర్ వివరించారు.
ఇదీ చూడండి : పేగు బంధాన్ని తెంచేసిన కరోనా మహమ్మారి