సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పురపలిక సంఘం ఆధ్వర్యంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని వర్తక సంఘం ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో కేసులు పెరుగుతున్నందున దుకాణాలు తెరిచే సమయం తగ్గించాలని తీర్మానం చేశారు.
నియోజకవర్గంలో ఇప్పటివరకు 3 కరోనా కేసులు నమోదు కావడం వల్ల ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వర్తక సంఘాలు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంగ్టిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంటాయని వర్తక సంఘాలు తెలిపాయి.
ఇవీ చూడండి: సంక్షోభంలో విద్యారంగం.. ప్రక్షాళన చేయాల్సిందే!