ఎస్సీ, ఎస్టీలు సామాజికంగా, ఆర్థికంగా అందరితో సమానంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బడ్డెట్లో ప్రత్యేక నిధులు కేటాయించిందని సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావు పేర్కొన్నారు. సంక్షేమ నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధుల మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖలకు కేటాయించిన నిధులు, పనుల పురోగతిపై సమీక్షించారు. మార్చి నాటికి లక్ష్యాలు చేరుకునేలా పనులు వేగవంతం చేయాలన్నారు. అంధోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సమావేశంలో పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, అందుకు తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యేలు అధికారులకు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'ఉద్యోగాలు పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చనిపోతాయి'