సంగారెడ్డి మున్సిపాలిటీలోని పలు వార్డులలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆధ్వర్యంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ప్రారంభమయింది. వారం రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో మురుగు కాల్వలు, నిల్వనీరు, పారిశుద్ధ్య పనులు, పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టనున్నట్టు అదనపు కలెక్టర్ తెలిపారు.
తొలిరోజు మున్సిపాలిటీ పరిధిలోని ఔరంగాబాద్, అవుసులపల్లి, హౌసింగ్బోర్డులలో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించారు. రెండవరోజు 6,7,8 వార్డులలో పారిశుద్ధ్య పనులు జరుగుతాయని తెలిపారు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. బహిరంగంగా చెత్త వేసిన వారికి జరిమానా విధించాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మంత్రి జగదీశ్‌రెడ్డి వర్సెస్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి