గోదావరి నీటిని సంగారెడ్డికి తరలించి నీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. తీవ్ర నీటి సమస్యతో సంగారెడ్డి పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగూరు నీటి తరలింపుతో సగం సంగారెడ్డి ఖాళీ అయిందని, ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారని చెప్పారు. పశువుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. ఈ విషయంలో సీఎం సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా దీనిపై బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో రాజకీయం లేదని ప్రజాకోణంలోనే చూడాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి " ఐదు రూపాయల భోజనం ఎట్లుంది పెద్దాయన.."