ETV Bharat / state

కరోనా వేళ 'ఉపాధి'నిస్తోంది... కష్టకాలంలో భరోనా నింపుతోంది!

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో... చాలామంది ఉపాధి కోల్పోయారు. అలాంటి వారికి భరోసానిస్తుంది ఉపాధి హామీ పథకం. పనుల్లేక గ్రామాల బాట పట్టిన వారికి ఈ పథకం ఓ వరంగా మారింది. అధికారులు, సిబ్బంది సమన్వయంతో... జాబ్ కార్డులు ఇచ్చి పని కల్పిస్తున్నారు. ఈ విషయంలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచింది.

sangareddy-first-in-national-rural-employment-guarantee-in-all-over-state-of-telangana
సంగారెడ్డి మొట్ట మొదటి స్థానంలో నిలిచింది... ఏమి చేసింది?
author img

By

Published : Jul 8, 2020, 6:32 PM IST

లాక్‌డౌన్ ప్రభావంతో ప్రతీ రంగం కుదేలైంది. ఉపాధి కోసం నగరాలకు వెళ్లిన లక్షలాది మంది పనుల్లేక సొంత గ్రామాలకు చేరుతున్నారు. స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో కూలీపనులు చేసే వాళ్లు.. ఆటోలు నడపే వారు సైతం కరోనా వల్ల కష్టాలపాలయ్యారు. వీరందరికీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం... కష్ట సమయంలో పని కల్పించి అండగా నిలిచింది. సాధారణంగా ఏప్రిల్‌, మే నెలల్లో వ్యవసాయ పనుల్లేక ఉపాధి హామీ పథకానికి డిమాండ్‌ ఉంటుంది. ఈ ఏడాది లాక్‌డౌన్‌ కారణంగా ఇది మరింతగా పెరిగింది. దీంతో ప్రభుత్వం ఉపాధి హమీ ద్వారా పనులు కల్పించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

సమర్థవంతంగా...

ఈ పథకాన్ని సంగారెడ్డి జిల్లాలో అధికారులు సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. 2020-21ఆర్థిక సంవత్సరంలో 84లక్షల పనిదినాలు కల్పించాలనే లక్ష్యం ఉండగా... ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే 52లక్షలకు పైగా పనిదినాలు కల్పించారు. 74 కోట్ల 50లక్షల రూపాయలు పైగా కూలీలకు చెల్లించారు. పని చేయడానికి ఆసక్తి చూపిన ప్రతి ఒక్కరికీ జాబ్ కార్డు ఇచ్చారు. వీటి జారీలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవగా.. పని దినాల కల్పనలో రెండో స్థానంలో నిలిచింది.

సంగారెడ్డి మొట్ట మొదటి స్థానంలో నిలిచింది... ఏమి చేసింది?

కరోనాతో పనులు కోల్పోయి ఆర్థికంగా సతమతం అవుతున్న వారికి.. ఉపాధి హమీ అండగా నిలుస్తోంది. పట్నం నుంచి పల్లెలకు వచ్చిన వారికి... స్థానికంగా ఉపాధి కోల్పోయిన వారికి దారి చూపిస్తోంది.

ఇదీ చూడండి: గాంధీలకు షాక్.. రాజీవ్ ఫౌండేషన్​పై విచారణకు కమిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.