సంగారెడ్డి జిల్లా మరోసారి జాతీయ స్థాయిలో ప్రతిభ కనభరించింది. జలశక్తి అభియన్లో దేశంలోనే రెండో ర్యాంకును సొంత చేసుకుంది. జిల్లాలో నీటి సంరక్షణకు వివిధ మార్గాల ద్వారా చేపట్టిన చర్యలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర బృందం జిల్లాలో పలుమార్లు పర్యటించి సమాచారం సేకరించింది. నీటి సంరక్షణకు కృషి చేసిన ప్రతీ ఒక్కరిని కలెక్టర్ హన్మంతరావు అభినందించారు. జలశక్తి అభియన్ రెండో దశలోనూ ఇదే స్ఫూర్తి కోనసాగించాలని కలెక్టర్ సూచించారు.
ఇవీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్ ఘన నివాళి