ETV Bharat / state

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన... బాధితులకు కలెక్టర్ ఆసరా​ - సంగారెడ్డి జిల్లా కలెక్టర్​ హనుమంతరావు

"కాళ్లు లేవు... నడిపించే నాన్న లేడు" శీర్షికన ఈనాడు - ఈటీవీ భారత్​ ప్రచారం చేసిన కథనానికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్​ హనుమంతరావు స్పందించారు. రోడ్డు ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన కుప్పానగర్​కు చెందిన బాలుడు రెహాన్​, అతని తల్లి షాహిదాను పరామర్శించి 50వేల ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేస్తామని, ప్రభుత్వ శాఖలో అవుట్​సోర్సింగ్​ విధానంలో షాహిదాకు ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తానని కలెక్టర్​ హామీ ఇచ్చారు.

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన... బాధితులకు కలెక్టర్ ఆసరా​
author img

By

Published : Aug 26, 2019, 3:06 PM IST

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన... బాధితులకు కలెక్టర్ ఆసరా​

రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన రెహాన్​ సహా తీవ్రంగా గాయపడి దివ్యాంగురాలిగా మారిన తల్లి షాహిదా విషాద గాథను "కాళ్లు లేవు... నడిపించే నాన్న లేడు" శీర్షికతో వెలుగులోకి తీసుకువచ్చిన ఈనాడు - ఈటీవీ భారత్​ కథనానికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్​ హనుమంతరావు స్పందించారు. ఝరాసంగం మండలం కుప్పానగర్​ చేరుకుని బాలుడిని, తల్లిని పరామర్శించారు. సొంతంగా పదివేలు, జిల్లా అధికారుల సంఘం తరఫున మరో 40 వేల ఆర్థిక సాయం అందజేశారు.

రెహాన్​కు ఆట బొమ్మలు

బాలుడికి అవసరమైన కొత్త కృత్రిమ కాళ్లను అందజేయడమేగాక మెరుగైన చికిత్స కోసం బాలుడ్ని, తల్లిని హైదరాబాద్​లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. కుటుంబానికి ఆరు నెలల పాటు అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సందర్శనకు వస్తూ బాలుడు ఆడుకునేందుకు రిమోట్ కారు, పియానో, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఆట బొమ్మలను తీసుకువచ్చి ఇచ్చారు. కాసేపు బాలుడితో కలెక్టర్ సరదాగా ఆడుతూ గడిపారు. అనంతరం ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేస్తామని, ప్రభుత్వ శాఖలో అవుట్​సోర్సింగ్ విధానంలో తల్లి షాహిదాకు ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కృతజ్ఞతలు

తమ దీన గాథను కథనంగా ప్రచురించిన ఈనాడు - ఈటీవీ భారత్​తో పాటు స్పందించిన జిల్లా పాలనాధికారికి బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. కలెక్టర్​తో పాటు తరలివచ్చిన జిల్లా అధికార యంత్రాంగం బాధిత కుటుంబానికి శాఖల వారీగా అందే ప్రయోజనాలను వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు.

Intro:tg_srd_26_26_etv_katananiki_spandana_ab_ts10059
( ).... "నడిచే కాళ్లు లేవు.. నడిపించే నాన్న లేడు" శీర్షికన ఈటీవీ ప్రచారం చేసిన కథనానికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పందించారు. రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన ఝరాసంగం మండలం కుప్పనగర్ గ్రామానికి చెందిన బాలుడు రెహన్ సహా తీవ్రంగా గాయపడి దివ్యాంగురాలుగా మారిన తల్లి షాహిదా విషాద గాథ వెలుగులోకి తెచ్చిన ఈటీవీ- ఈనాడు కథనాలకు స్పందించిన జిల్లా పాలనాధికారి కుప్పానగర్ చేరుకొని బాలుడిని, తల్లిని పరామర్శించారు. ఈ సందర్భంగా సొంతంగా పదివేలు, జిల్లా అధికారుల సంఘం తరఫున మరో 40 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. బాలుడికి అవసరమైన కొత్త కృత్రిమ కాళ్లను అందజేయడంతో పాటు మెరుగైన చికిత్స కోసం బాలుడ్ని, తల్లిని హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. కుటుంబానికి ఆరు నెలల పాటు అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సందర్శనకు వస్తూ బాలుడు ఆడుకునేందుకు రిమోట్ కారు, వాయించేందుకుకు పియానో, ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఆట బొమ్మలను తీసుకువచ్చి అందజేయడంతో రెహాన్ కళ్ళలో వెలుగులు వచ్చాయి. కాసేపు బాలుడితో కలెక్టర్ సరదాగా ఆడుతూ గడిపారు. అనంతరం ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేస్తామని, ప్రభుత్వ శాఖలో అవుట్సోర్సింగ్ విధానంలో తల్లి షాహిదాకు ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీన గాథను కథనంగా ప్రచురించిన ఈటీవీ తో పాటు స్పందించిన జిల్లా పాలనాధికారి కి బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. కలెక్టర్తో పాటు జిల్లా అధికార యంత్రాంగం తరలి వచ్చి బాధిత కుటుంబానికి శాఖల వారీగా అందే ప్రయోజనాలను వర్తింప చేస్తామని ఈ సందర్భంగా అధికారులు హామీ ఇచ్చారు.
vis.. byte...
1. హనుమంతరావు జిల్లా కలెక్టర్ సంగారెడ్డి
2. షాహిదా, బాలుడి తల్లి

Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా

Conclusion:8008573254
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.