సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో కలెక్టర్ హనుమంతరావు పర్యటించారు. వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రతి ఆస్తి వివరాలు అంతర్జాలంలో నమోదు చేయాలని సూచించారు. ఇంటర్నెట్ సమస్య ఉందనే సాకుతో కాలయాపన చేస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించారు.
చిన్న చిన్న గ్రామాల్లో నమోదు పూర్తయితే.. ఖాళీగా ఉన్న ఆయా గ్రామాల కార్యదర్శులను వాడుకోవాలని ఎంపీడీవోలకు సూచించారు. ఇప్పటికే ఆస్తుల నమోదు ఆలస్యమైందని.. వీలైనంత వేగంగా పూర్తి చేసి.. ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో ఆయన రైతువేదిక నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణ పనులు వేగవంతం చేసి.. గడువు తేదీ కల్లా రైతువేదికలు సిద్ధం చేయాలన్నారు.
ఇవీ చూడండి: గ్రామ కార్యదర్శికి ఆస్తుల వివరాలు తెలిపిన సీఎం కేసీఆర్