బియ్యం, నిత్యవసర సరుకుల కోసం ఇంటి నుంచి ఒక్కరే బయటకు రావాలని గుంపులు గుంపులుగా రావొద్దని కలెక్టర్ హన్మంతరావు సూచించారు. జిల్లాలో 250 మంది క్వారంటైన్లో ఉన్నారని, వారికి కావాల్సిన సరుకులు ఇంటివద్దకే పంపిస్తామన్నారు. అధికార యంత్రాంగం ప్రజల కోసమే పనిచేస్తుందని, భయపడాల్సిన పరిస్థితి లేదని అన్నారు. అప్రమత్తత, బాధ్యత రెండూ పాటిస్తే సమస్య తగ్గిపోతుందని చెప్పారు.
విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని, బయటకు వస్తే పాస్పోర్టు రద్దు చేస్తామని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని ప్రకటించారు. వ్యాపారులు నిత్యవసర సరుకుల ధరలు పెంచి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అకారణంగా రోడ్ల మీదకు వచ్చిన 600 వాహనాలను సీజ్ చేశామన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలంతా సయమనం, సమన్వయం పాటించాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి : కరోనా కట్టడికి తన వంతు ప్రయత్నం చేస్తోన్న సర్పంచ్