వైద్య పరీక్షల తర్వాతే అంతర్ రాష్ట్ర ప్రయాణ పాసులు జారీ చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు... అధికారులకు సూచించారు. మొగుడంపల్లి మండలం మాడిగి వద్ద... 65వ నెంబర్ జాతీయ రహదారిపై గల తెలంగాణ-కర్ణాటక సరిహద్దు చెక్‌పోస్ట్‌ను సందర్శించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ల వద్ద అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి అంతరాష్ట్ర ప్రయాణ పాసుల జారీ ప్రక్రియ నిర్వహించాలన్నారు.
వైద్యులు, పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు పాసుల జారీ కేంద్రం వద్ద ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ ముద్రలు వేసి అనుమతించాలని తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు లేకపోయినా లాక్డౌన్ అమలు సంపూర్ణంగా అమలు చేయాలని డీఎస్పీ గణపతి జాదవ్‌కు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రమేష్ బాబు, అధికారులు ఉన్నారు.
ఇదీ చూడండి: 'ప్రజలకు నేరుగా డబ్బులు ఇస్తేనే ఆర్థిక పునరుద్ధరణ'