సంగారెడ్డి వసంత్‌నగర్ కాలనీకి చెందిన ఐదేళ్ల శ్రీచంద్ర, మూడేళ్ల రౌద్రాన్ష్ అనే ఇద్దరు చిన్నారులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు రికార్డులు సొంతం చేసుకున్నారు. చిన్నారుల ప్రతిభకు గాను ఇంటర్నేషనల్ వండర్ బుక్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వారికి మెడల్స్ అందించారు. 1975 నుంచి 2019 వరకు జరిగిన 11 ప్రపంచకప్‌లలో పాల్గొన్న క్రికెటర్లు పేర్లు నిమిషం 20 సెకన్లలో చెప్పినందుకు గాను చిన్నారులు ఈ రికార్డులు అందుకున్నారు. తమ పిల్లలు ఈ ఘనత సాధించడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ వండర్ బుక్, జీనియస్ బుక్‌లలో ఇలాంటి రికార్డు కోసం ఎవరూ ప్రయత్నించలేదని.. ఈ చిన్నారుల ప్రతిభ ఆమోఘమని ఆయా సంస్థల ప్రతినిధులు వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆరో రోజుకు చేరిన టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె